Karnataka: కరోనా భయాలతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన నలుగురు కర్ణాటక మంత్రులు

4 Karnataka ministers sent to self isolation
  • వివిధ మంత్రులను కలిసిన జర్నలిస్టు
  • సదరు జర్నలిస్టుకు కరోనా నిర్ధారణ
  • స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన వారిలో డిప్యూటీ సీఎం, హోం మంత్రి
కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్టుకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో నలుగురు రాష్ట్ర మంత్రులు సెల్ఫ్ ఐసొలేషన్ కు వెళ్లారు. ఈ నెల 21 నుంచి 24 మధ్య ఓ టీవీ ఛానల్ కు చెందిన జర్నలిస్టు వివిధ శాఖల మంత్రులను కలిశారు.

వీరిలో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ, హోం మంత్రి  బస్వరాజ్ బొమ్మాయి కూడా ఉండటం గమనార్హం. మిగిలిన వారిలో వైద్య విద్య మంత్రి డాక్టర్ సుధాకర్, పర్యాటక మంత్రి రవి ఉన్నారు. వీరు నలుగురూ కరోనా టెస్టులు చేయించుకోగా... నెగెటివ్ అని తేలింది. అయినా జాగ్రత్త చర్యల్లో భాగంగా వీరంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
Karnataka
Corona Virus
Ministers
Self Isolation

More Telugu News