Sensex: ఏప్రిల్ ను భారీ లాభాల్లో ముగించిన మార్కెట్లు.. 997 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

  • 307 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 
  • 13.40 శాతం లాభపడ్డ ఓఎన్జీసీ
  • 3 శాతం వరకు నష్టపోయిన నిఫ్టీ
Sensex ends 997 points higher

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ నెలను భారీ లాభాల్లో ముగించాయి. సెన్సెక్స్ ఈ నెలలో ఏకంగా 14 శాతం పెరిగింది. గత 11 సంవత్సరాల్లో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. కరోనాకు మందును కనుక్కోబోతున్నారనే వార్తలు, ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు మార్కెట్లలో జోష్ పెంచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 997 పాయింట్లు పెరిగి 33,718కి చేరుకుంది. నిఫ్టీ 307 పాయింట్లు లాభపడి 9,860 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (13.40%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (10.44%), హీరో మోటో కార్ప్ (9.94%), టీసీఎస్ (5.76%), టాటా స్టీల్ (5.65%).

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-2.72%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.55%), ఏసియన్ పెయింట్స్ (-0.45%).

More Telugu News