Tollywood: చైతూతో విక్రం కుమార్ ‘థాంక్యూ’

Naga Chaitanyas Movie with vikram kumar Gets Title THANK YOU
  • గతంలో అఖిల్ తో 'హలో' చేసిన విక్రం కుమార్ 
  • లాక్ డౌన్ తర్వాత నాగ చైతన్యతో సెట్స్ పైకి 
  • ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’లో నటిస్తున్నచైతన్య
‘మనం’ చిత్రంతో అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని అందించిన దర్శకుడు విక్రమ్‌ కుమార్. ఆ తర్వాత కూడా ఆ కుటుంబ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్నారు. అక్కినేని అఖిల్‌తో ‘హలో’ తీసిన విక్రమ్‌ ఇప్పుడు నాగచైతన్యతో కూడా ఓ చిత్రానికి అంగీకరించినట్టు సమాచారం. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో నటిస్తున్న చైతన్య తన తర్వాతి సినిమాను విక్రమ్‌తో చేయనున్నట్టు తెలుస్తోంది.

విక్రమ్‌ ఇప్పటికే చైతన్యకు కథ వినిపించారట. కథ నచ్చడంతో అక్కినేని హీరో కూడా దర్శకుడికి  ఓకే చెప్పినట్టు  తెలుస్తోంది. ఈ సినిమాకు ‘థాంక్యూ’ అనే టైటిల్‌ను కూడా దర్శకుడు ఖరారు చేసినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి, తమ్ముడితో ‘హలో’ అనిపించిన విక్రమ్‌.. ఇప్పుడు అన్నతో ‘థాంక్యూ’ చెప్పిస్తారో లేదో చూడాలి.
Tollywood
Naga chaitanya
vikram kumar
new movie
title

More Telugu News