harish shankar: 'ఏయ్‌ నా బైకును ముట్టుకోకు' అంటూ హైదరాబాద్‌ పోలీసులను బెదిరించిన వ్యక్తి.. వీడియో ట్వీట్ చేసిన హరీశ్ శంకర్

harish shankar tweet
  • లంగర్‌హౌజ్‌లో ఘటన
  • రోడ్డుపై వ్యక్తిని ఆపిన పోలీసులు
  • హెల్మెట్‌ లేదని ప్రశ్నించినందుకు హల్‌చల్‌
'సర్, ఒకవేళ మీరు ఈ వీడియో చూడడం మిస్సయితే ఇప్పుడు చూడండి' అంటూ హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు సినీ దర్శకుడు హరీశ్ శంకర్ ఓ వీడియో పోస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఓ వ్యక్తిని ఆపి, హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. దీంతో పోలీసులపై ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తించి, దుర్భాషలాడాడు. తన బైకుని కింద పడేసి హల్‌చల్‌ చేశాడు. 'ఏయ్ నా బండిని ముట్టుకోకు' అంటూ పోలీసులనే బెదిరించాడు.‌

ఈ వీడియోను పోస్ట్ చేసిన హరీశ్‌ శంకర్.. 'కరోనా విపత్కర సమయంలో పోలీసులందరూ తమ జీవితాలను ప్రమాదంలో పెట్టి పనిచేస్తోంటే, మనం ఇటువంటి ఘటనలు చూడాల్సి వస్తోంది. దీనిపై ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు' అని హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఆ వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిసింది.


harish shankar
Tollywood
Hyderabad
Corona Virus
Lockdown

More Telugu News