shruti hasan: సిగరెట్, పొగాకు వాసన అంటే ఇష్టమే కానీ..!: శ్రుతిహాసన్

I Like cigarette smell says shruti hasan
  • వాటిని కాల్చినప్పుడు వచ్చే వాసన మాత్రం నచ్చదు
  • ‘కాల్‌ రికార్డు’ యాప్‌  ఎక్కువగా  ఉపయోగిస్తా
  • ‘క్రాక్‌’ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వనున్న శ్రుతి
తనకు వచ్చే ఫోన్‌ కాల్స్‌ను రికార్డు చేస్తానని ప్రముఖ నటి శ్రుతిహాసన్‌ చెప్పింది.  తన ఫోన్‌లో కాల్‌ రికార్డ్‌ యాప్‌ను ఎక్కువగా వాడుతానని ఈమెయిల్‌, మెస్సేజ్‌లు కాకుండా తాను ఎక్కువగా ఉపయోగించే యాప్ ఇదేనని తెలిపింది. కరోనా నేపథ్యంలో షూటింగ్‌లకు విరామం రావడంతో ప్రస్తుతం తన ఇంటికే పరిమితమైన శ్రుతి సోషల్‌ మీడియాతో అభిమానులతో టచ్‌లో ఉంది.  లాక్‌డౌన్‌లో తాను ఏం చేస్తున్నానో వారితో పంచుకుంది.

తనకు సిగరెట్‌, పొగాకు వాసన అంటే ఇష్టమని చెప్పింది. అయితే, వాటిని కాల్చినప్పుడు వచ్చే వాసన మాత్రం నచ్చదు అని తెలిపింది. గులాబి, చాక్లెట్‌, పెన్సిల్, వెనిలా ఫ్లేవర్ వాసన అంటే కూడా ఇష్టమని చెప్పింది. చిన్నప్పుడు ఎరైజర్ సువాసనను ఎక్కువగా ఇష్టపడేదానినని  శ్రుతి తెలిపింది. కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న శ్రుతి హాసన్.. ‘క్రాక్‌’ చిత్రంతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో రవితేజ సరసన ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీచంద్‌ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
shruti hasan
likes
cigarette
smell

More Telugu News