Chandrababu: విశాఖలో విజయసాయిరెడ్డి విపరీతంగా చందాలు వసూలు చేస్తున్నారు: చంద్రబాబునాయుడు

Chandrababu Naidu allegations on Vijayasaireddy
  • ట్రస్టు ముసుగులో బలవంతపు వసూళ్లు
  • పంపిణీ ముసుగులో వసూళ్ల దందా
  •  ‘కరోనా’.. వైసీపీ నాయకులకు ఏటీఎంగా మారింది 
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో విపరీతంగా చందాలు వసూలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏపీ టీడీపీ  విస్తృతస్థాయి సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ట్రస్టు ముసుగులో బలవంతపు వసూళ్లకు, పంపిణీ ముసుగులో వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘కరోనా’.. వైసీపీ నాయకులకు ఏటీఎంగా మారిందని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలను నిరసిస్తూ మండల స్థాయిలో కూడా దీక్షలు నిర్వహించాలని, 12 గంటల దీక్షలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఓట్ల కక్కుర్తితో వైసీపీ నేతలు గుంపులుగా తిరిగారని, కర్నూలు, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాలను ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు. ‘కరోనా’ వైరస్ తీవ్రంగా ఉన్న 15 జిల్లాల్లో కర్నూలు ఒకటి కావడం ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు.
Chandrababu
Telugudesam
Vijay Sai Reddy
YSRCP

More Telugu News