ఇకపై మల్టీ స్టారర్ సినిమాల జోలికి పోను: దర్శకుడు అజయ్ భూపతి

29-04-2020 Wed 15:28
  • 'ఆర్ ఎక్స్ 100'తో భారీ హిట్
  • రెండో సినిమాగా మల్టీస్టారర్
  • ఆలస్యమవుతూ వచ్చిన ప్రాజెక్ట్  
Mahasamudram Movie
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో దర్శకుడు అజయ్ భూపతి తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తరువాత ఆయన ఒక మల్టీ స్టారర్ కథను తయారు చేసుకున్నాడు. రవితేజ .. సాయిధరమ్ తేజ్ .. నాగచైతన్య తదితరులకు ఆయన ఈ కథని వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్లంతా కూడా ఆయా కారణాల వలన ఈ ప్రాజెక్టుపై అంతగా ఆసక్తిని చూపలేదు.

దాంతో అజయ్ భూపతికి రెండో ప్రాజెక్టును సెట్ చేయడమే చాలా కష్టమైపోయింది. మొత్తానికి ఆయన ఒక కథానాయకుడిగా శర్వానంద్ ను .. మరో కథానాయకుడిగా సిద్ధార్థ్ ను ఎంపిక చేసుకుని, లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు విషయంలో విసిగిపోయిన ఆయన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'నా కెరియర్లో తొలి మల్టీ స్టారర్ .. చివరి మల్టీ స్టారర్ ఇదే. మల్టీ స్టారర్ కథలను రాయడం ఒక ఎత్తు .. ఆ కథను చెప్పి హీరోలను ఒప్పించడం మరో ఎత్తు' అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు.