Kangana Ranaut: కంగనాతో విడిపోయిన తర్వాత ఎంతో హ్యాపీగా ఉంది: అధ్యాయన్ సుమన్

My life is happy after parted from Kangana says Adhyayan Suman
  • నన్ను, నా కుటుంబాన్ని కంగన ఎంతో బాధ పెట్టింది
  • ఆమెతో విడిపోయిన తర్వాత జీవితంలో ముందుకెళ్లాను
  • అప్పట్లో నాకు ఎవరూ మద్దతు తెలపలేదు
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ గతంలో హీరో అధ్యాయన్ సుమన్ తో డేటింగ్ చేసింది. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కంగనా వ్యవహారం రచ్చరచ్చ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పక్కన పెడితే... కంగనాతో సుమన్ విడిపోయిన విషయంపై నటి కవితా కౌశిక్ స్పందించింది. సుమన్ ను కంగనా చాలా దారుణంగా విమర్శించిందని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన కవితకు సుమన్ ధన్యవాదాలు తెలిపాడు. కంగనాతో విడిపోయినప్పుడు తనకు ఎవరూ మద్దతు తెలపలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను, తన కుటుంబ సభ్యులను కంగనా చాలా బాధపెట్టిందని చెప్పాడు. ఆమెతో విడిపోయిన తర్వాత తన జీవితం చాలా సంతోషంగా మారిందని తెలిపాడు. ఆ తర్వాతే జీవితంలో ముందుకు వెళ్లానని చెప్పాడు.
Kangana Ranaut
Adhyayan Suman
Dating
Bollywood

More Telugu News