Nimmagadda Ramesh: ఇక నేరుగా హైకోర్టులోనే విచారణ జరుపుతాం: నిమ్మగడ్డ వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం

  • ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపుపై విచారణ
  • విచారణ సోమవారానికి వాయిదా
  • భౌతిక దూరం పాటిస్తూ సోమవారం విచారణ
  • పిటిషనర్లు, న్యాయవాదులకు హైకోర్టు ప్రత్యేక పాసులు జారీ
ap high court on nimmagadda pitition

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తొలగింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు విచారణ జరిపింది. ఆయన తొలగింపుపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నిమ్మగడ్డ వేసిన పిటిషన్లపై కూడా విచారణ జరిపిన న్యాయస్థానం, ఆయన పదవీ కాలం కుదింపు వ్యాజ్యంపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

సోమవారం నేరుగా హైకోర్టులోనే విచారణ జరగనుంది. బౌతిక దూరం పాటిస్తూ విచారణకు అందరూ సహకరించాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఇందుకోసం పిటిషనర్లు, న్యాయవాదులకు హైకోర్టు ప్రత్యేక పాసులు జారీ చేస్తామని, సదరు పాస్‌లు ఇవ్వాల్సిందిగా డీజీపీకి లేఖ రాస్తామని పేర్కొంది.
 
కాగా, విచారణ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఇతరులు రావడంపై హైకోర్టు చివాట్లు పెట్టినట్లు తెలిసింది. ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఎలా వచ్చారని ప్రశ్నించింది. వీడియో కాన్ఫరెన్స్‌లోకి ఎంటర్‌ అయ్యే పాస్‌వర్డ్‌ లీక్‌ చేయడం వల్లే ఇలా జరుగుతుందని పేర్కొంది. 

More Telugu News