Cyclone: భవిష్యత్తులో వచ్చే తుపానులకు పెట్టిన పేర్లు ఇవే!

IMD Approves New Names for Cyclones
  • షాహీన్, రోజ్, తేజ్, అగ్ని పేర్లు ఖరారు
  • 13 దేశాల నుంచి పేర్లపై ప్రతిపాదనలు
  • వెల్లడించిన భారత వాతావరణ శాఖ
సమీప భవిష్యత్తులో ఏర్పడే తుపానులకు అధికారులు పేర్లు పెట్టారు. అరేబియా సముద్రంతో పాటు ఉత్తర హిందూ మహా సముద్రంలో ఏర్పడే తుపానులకు 13 దేశాలు 169 పేర్లను సూచించగా, వాటి వివరాలను భారత వాతావరణ శాఖ సూచించింది. రాబోయే తుపానులకు షాహీన్, రోజ్, తేజ్, అగ్ని తదితర పేర్లను ఖరారు చేసినట్టు  వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్రా తెలిపారు. భారత్ తో పాటు  బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ తలా 13 పేర్ల చొప్పున సూచించాయని అన్నారు.

ఇండియా తరఫున తేజ్, ఆగ్, నీర్ మురాసు (తమిళ సంగీత వాయిద్యం), ప్రభంజన్, అంబుల్, జలధి, ఘర్ని తదితర పేర్లను సూచించామన్నారు. కాగా, తుపానులకు పేర్లను పెడుతున్న విధానం ఇండియాలో 2004 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే.
Cyclone
Names
IMD
Rose
Agni
Shaheen
Tej

More Telugu News