CPI Ramakrishna: కరోనా ఎప్పటికీ మనతోనే ఉంటుందన్న జగన్ వ్యాఖ్యలపై సీపీఐ రామకృష్ణ ఫైర్

CPI Ramakrishna fires on Jagan over his comments on corona
  • సాధారణ జ్వరంతో పోల్చడం దారుణం
  • సీఎం పేషీలో ఎవరికైనా కరోనా వస్తే తప్ప అది ప్రమాదకరమైన వ్యాధి అని గుర్తించరా?
  • రాష్ట్రంలో కేసులు తెలంగాణను మించిపోయాయి
కరోనా వైరస్ పై ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పుపట్టారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రతను తక్కువ చేసి మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదని అన్నారు. సాధారణ జ్వరంతో కరోనా వైరస్ ను పోలుస్తూ మాట్లాడటం విచారకరమని చెప్పారు. కరోనా ఎప్పటికీ మనతోనే ఉంటుందని వ్యాఖ్యానించడం దారుణమని... సీఎం పేషీలో ఎవరికైనా కరోనా వస్తే తప్ప అది ప్రమాదకరమైన వ్యాధి అని గుర్తించరా? అని మండిపడ్డారు.

ఏపీలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోందని... రాష్ట్రంలోని కేసులు తెలంగాణను మించిపోయాయని ఆయన చెప్పారు. రాజ్ భవన్ సిబ్బందికి, ఆరోగ్యమంత్రి సిబ్బందికి కూడా కరోనా సోకిందని...  పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా వ్యాధి తీవ్రతను తక్కువ చేస్తూ సీఎం మాట్లాడటం సరికాదని అన్నారు.
CPI Ramakrishna
Jagan
YSRCP
Corona Virus

More Telugu News