Raj Bhavan: ఏపీ రాజ్ భవన్ లో నలుగురికే కరోనా పాజిటివ్.. మిగతా వారికి నెగెటివ్

AP Raj Bhavan employs tested corona positive
  • రాజ్ భవన్ లో నలుగురికి కరోనా
  • గవర్నర్ సెక్యూరిటీ ఆఫీసర్ తో పాటు నర్సు, ఇద్దరు అటెండర్లకు పాజిటివ్
  • గవర్నర్ కు నెగెటివ్
ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తాజాగా రాజ్ భవన్ ఉద్యోగులకు కూడా ఈ ప్రమాదకర వైరస్ సోకినట్టు గుర్తించారు. రాజ్ భవన్ లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయినవారిలో ఒకరు గవర్నర్ సెక్యూరిటీ ఆఫీసర్ కావడం గమనార్హం. మిగిలినవారిలో ఇద్దరు అటెండర్లు, ఒక స్టాఫ్ నర్సు ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఊరట కలిగించే అంశం ఏమిటంటే, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పరీక్షలు నిర్వహిచంగా నెగెటివ్ అని వచ్చింది. రాజ్ భవన్ లోని ఇతర సిబ్బందికి కూడా టెస్టులు నిర్వహించగా, నెగెటివ్ అని తేలిందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు.
Raj Bhavan
Corona Virus
Positive
Governor
Biswabhusan Harichandan
Andhra Pradesh

More Telugu News