Sea Angel: సముద్రంలో దేవతాకారంలో ఉన్న వింత జీవి.. ఫొటో తీసిన రష్యా బయాలజిస్ట్!

  • విస్తుగొలిపే రూపంతో ఉన్న 'సముద్ర దేవత'
  • 'టెరోడ్ మొలుస్క్' గా చెలామణి 
  • వీటి గురించి తెలిసింది చాలా తక్కువేనంటున్న బయాలజిస్ట్
Russian Marine biologist clicked sea angel under the White sea

సముద్రాలు అపార జీవ వైవిధ్యానికి నెలవు. భూమ్మీద ఉన్న ప్రాణుల కంటే సముద్రంలో మనుగడ సాగిస్తున్న జీవరాశి ఎన్నో రెట్లు అధికం. ఇప్పటికే అనేక జీవజాతులు మహాసముద్రాల్లో అట్టడుగున జీవిస్తూ సైన్స్ కు అందని రీతిలో విస్మయం కలిగిస్తున్నాయి. తాజాగా, రష్యాకు చెందిన ఓ సముద్ర జీవశాస్త్రవేత్త (మెరైన్ బయాలజిస్ట్) సముద్ర గర్భంలో ఓ జీవిని ఫొటో తీశారు. ఈ జీవి దేవత వంటి ఆకారంతో ఆశ్చర్యం కలిగించేలా ఉంది.

దీన్ని ఫొటో తీసిన పరిశోధకుడి పేరు అలెగ్జాండర్ సెమెనోవ్. వెన్నెముక లేని జీవజాలంపై స్పెషలైజేషన్ చేశాడు. మాస్కో స్టేట్ యూనివర్సిటీకి చెందిన వైట్ సీ బయోలాజికల్ స్టేషన్ డైవర్ల బృందానికి నాయకుడు. సముద్రాల్లో ప్రతికూల పరిస్థితుల్లో సైతం పరిశోధనలు సాగించే సెమెనోవ్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కూడా.

తాజాగా, రష్యాలోని తెల్ల సముద్రంలో మంచు ఫలకాల అడుగుభాగాన ఓ అద్భుతమైన జీవిని సెమెనోవ్ క్లిక్ మనిపించాడు. సముద్ర దేవతగా అభివర్ణించే ఈ జీవిని అత్యున్నత నాణ్యతతో ఫొటో తీశాడు. ఆ ఫొటోలను తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా పంచుకున్నాడు. సముద్ర దేవతలు ఎంతో అందమైనవే అయినా, అంతుచిక్కని జీవులని పేర్కొన్నాడు. న్యూరో బయాలజీలో ఎక్కువగా అధ్యయనం చేసే వీటిని టెరోపోడ్ మోలుస్క్ అని పిలుస్తారని తెలిపాడు. అయితే వాటి జీవితచక్రం గురించి తెలిసింది చాలా తక్కువ అని సెమెనోవ్ పేర్కొన్నాడు.

More Telugu News