Corona Virus: ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. మరో 82 మందికి కరోనా నిర్ధారణ

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య ప్రతి రోజు భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 5,783 శాంపిళ్లను పరీక్షించగా 82 మందికి కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1,259 పాజిటివ్ కేసులకు గాను 258 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారని వివరించింది.

ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 970గా ఉందని తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 1, చిత్తూరులో 1, గుంటూరులో 17, కడపలో 7, కృష్ణాలో 13, కర్నూలులో 40, నెల్లూరులో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  

జిల్లాల వారీగా వివరాలు...                                                                             
                                         గ్రాఫ్‌ రూపంలో..
                    
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News