Venkatesh: లాక్ డౌన్ తరువాత అనంతపురానికి 'నారప్ప'

Narappa Movie
  • రీమేక్ లకి ప్రాధాన్యతనిచ్చే వెంకటేశ్
  • 'అసురన్' సినిమా రీమేక్ గా 'నారప్ప'
  • త్వరలోనే తదుపరి షెడ్యూల్
మొదటి నుంచి రీమేక్ చిత్రాలకి వెంకటేశ్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఆయన కెరియర్లో భారీ విజయాలను అందుకున్న చిత్రాలలో రీమేక్ చిత్రాల సంఖ్య ఎక్కువగానే వుంది. ఆయన తాజా చిత్రంగా 'నారప్ప' రూపొందుతోంది. తమిళంలో సంచలన విజయాన్ని నమోదు చేసిన 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. లాక్ డౌన్ కారణంగా షూటింగు వాయిదా పడింది.

లాక్ డౌన్ తరువాత 'అనంతపురం'లో అవుట్ డోర్ షెడ్యూల్ వుంది. కొన్ని సన్నివేశాలను అక్కడే చిత్రీకరించవలసి ఉందట. అవి 'సెట్' వేసి తీసే సీన్స్ కాదు. అందువలన లాక్ డౌన్ తరువాత పరిస్థితులను చూసుకుని, ఈ సినిమా టీమ్ అక్కడికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని పాత్ర కోసం వెంకీ చాలా కసరత్తు చేశాడని అంటున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్ పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు.
Venkatesh
Priyamani
Srikanth Addala

More Telugu News