Chandrababu: ఏడేళ్ల నాటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్న చంద్రబాబునాయుడు!

Chandrababu Vastunna Meekosam Padayatra Complets 7 Years
  • ఏడేళ్ల క్రితం 'వస్తున్నా మీకోసం' పేరిట పాదయాత్ర
  • ఏప్రిల్ 28న ముగిసిన పాదయాత్ర
  • ట్విట్టర్ లో స్పందించిన చంద్రబాబు
ఏడు సంవత్సరాల క్రితం ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చంద్రబాబునాయుడు ప్రారంభించిన 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ఏప్రిల్ 28న ముగిసింది. ఆరు పదులు దాటిన వయసులోనూ ఆయన 2,817 కిలోమీటర్ల దూరం నడిచి, ఆపై జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకున్న చంద్రబాబు, తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.

"ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని కలిసి మీకు నేనున్నా అనే భరోసా ఇవ్వడం కోసం 'వస్తున్నా.. మీకోసం' పేరుతో నేను చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర ఏడేళ్ళ క్రితం ఇదే రోజున విశాఖలో ముగిసింది. సుమారు 7 నెలల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ 62 ఏళ్ళ వయసులో 2,817 కిలోమీటర్లు నడిచాను" అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఆపై, "నాటి పాదయాత్రలో నేను స్వయంగా తెలుసుకున్న ప్రజల కష్టాలను తీర్చడానికి గత ఐదేళ్ళ పాలనలో రోజుకు 18గంటలు పనిచేసాను. 208 రోజులు 16 జిల్లాల్లో సాగిన 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రలో అడుగడుగునా నా వెన్నంటి నిలిచి, నాకు స్ఫూర్తినిచ్చిన కార్యకర్తలు, నేతలు, ప్రజలందరికీ ధన్యవాదాలు" అంటూ పేర్కొన్నారు. 
Chandrababu
Vastunna Meekosam
Padayatra
7 Years

More Telugu News