Tamilnadu: చిత్తూరు కలెక్టర్ జోక్యంతో... రోడ్లపై కట్టిన గోడలను కూల్చేసిన తమిళనాడు అధికారులు!

  • సరిహద్దుల వద్ద గోడలు కట్టిన తమిళనాడు అధికారులు
  • గోడలు కూల్చివేయాలని చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తా వినతి
  • మూడు ప్రాంతాల్లో గోడల తొలగింపు
Wall on Borders Removed Near Chittore

చిత్తూరు జిల్లా పరిధిలోని పలు మండలాల నుంచి తమిళనాడుకు దారితీసే రహదార్లపై వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు నిర్మించిన గోడలను అధికారులు తొలగించారు. పలమనేరు - గుడియాత్తం, సంగమంగళం - వేలూరు, చిత్తూరు - తిరుత్తణి మార్గాల్లోని సరిహద్దుల వద్ద తమిళనాడు అధికారులు గోడలను నిర్మించగా, ఈ వార్త వైరల్ అయింది. ఈ అడ్డుగోడల వద్ద ఇరు రాష్ట్రాల రైతులూ ఇబ్బందులు పడుతున్నారని చిత్తూరు కలెక్టర్ భరత్ గుప్తాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన ఆయన, తమిళనాడు అధికారులను సంప్రదించి, గోడల కారణంగా ఏర్పడుతున్న నష్టాన్ని వివరించారు. వెంటనే వాటిని తొలగించాలని సూచించారు. దీంతో ఈ మూడు ప్రాంతాల్లో నిర్మించిన గోడలను అధికారులు కూల్చి వేశారు.

More Telugu News