Balakrishna: బాలకృష్ణతో సినిమా తీయడంపై రాజమౌళి స్పందన ఇది!

Rajamouli Comments on Movie with Balakrishna
  • లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రాజమౌళి
  • కొన్ని కథలు విన్నప్పుడు బాలకృష్ణ సరిపోతాడనిపించింది
  • సినిమా చేయడం మాత్రం కుదరలేదన్న రాజమౌళి
లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన అగ్ర దర్శకుడు రాజమౌళి, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బాలయ్యతో మూవీపై స్పందిస్తూ.. ప్రతి దర్శకుడికీ, స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి, తమ స్థాయిని పెంచుకోవాలని ఉంటుందని అభిప్రాయపడిన రాజమౌళి, ఏదైనా కథ అనుకున్నప్పుడు, ఫలానా హీరో అయితే సరిపోతాడని దర్శకులకు అనిపిస్తుందని, తనకు కూడా కొన్ని కథలు విన్నప్పుడు బాలకృష్ణ అయితే, బాగుంటుందని అనిపించిందని చెప్పుకొచ్చారు. అయితే, బాలయ్యతో సినిమా చేయడం మాత్రం ఇంకా వీలుపడలేదని అన్నారు. కాగా, బాలయ్య నటించిన సినిమా రిలీజ్ సందర్భంగా, తొలి రోజునే రాజమౌళి థియేటర్ కు వెళ్లి మరీ దాన్ని చూస్తారట!
Balakrishna
Rajamouli
Movie
Interview

More Telugu News