Rapid Test Kits: చైనా కిట్లకు మంగళం... ఆర్డర్ క్యాన్సిల్ చేసుకుంటున్న కేంద్రం

  • లోపభూయిష్టంగా చైనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు!
  • వాడకం నిలిపివేయాలని రాష్ట్రాలకు సూచించిన ఐసీఎంఆర్
  • రెండు చైనా కంపెనీల కిట్లు నాసిరకంగా ఉన్నట్టు వెల్లడి
Union Government cancels test kit orders

చైనా కంపెనీలు తయారు చేస్తున్న ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్ కిట్ల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో కేంద్రం ఆర్డర్లను రద్దు చేసుకుంటోంది. నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో చైనా నుంచి ర్యాపిడ్ టెస్ట్ కిట్ల దిగుమతి ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ సందర్భంగా విధివిధానాలను కచ్చితంగా పాటిస్తున్నందున ఒక్క రూపాయి కూడా నష్టం రాదని స్పష్టం చేసింది. రెండు చైనా కంపెనీలు (బయోమెడెమిక్స్, వోండ్ ఫో) తయారు చేసిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా ఫలితాలు సరిగా రావడంలేదన్న ఫిర్యాదులు రావడంతో దేశంలో ర్యాపిడ్ కిట్ల వాడకాన్ని నిలిపివేయాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా ప్రకటన చేసింది.

More Telugu News