Alejandrina: కరోనా కష్టకాలంలో మాఫియా డాన్ కుమార్తె దాతృత్వం

  • మెక్సికోలో లాక్ డౌన్
  • పేదలను ఆదుకుంటున్న డ్రగ్ సిండికేట్ కింగ్ 'ఎల్ చాపో' కుమార్తె
  • సిబ్బంది ద్వారా దేశవ్యాప్తంగా నిత్యావసరాల పంపిణీ
Mexico don daughter charity act for poor

మెక్సికోలో జోక్విన్ 'ఎల్ చాపో' గుజ్ మాన్ ఓ ఫేమస్ మాఫియా డాన్. వేల కోట్ల ఆస్తి అతడి సొంతం. అగ్రరాజ్యం అమెరికాతో పాటు అనేక దేశాలకు డ్రగ్స్ సరఫరా చేసే సిండికేట్లను శాసించే రియల్ లైఫ్ డాన్ గా గుజ్ మాన్ సుప్రసిద్ధుడు. సినీ హీరోలకు తగ్గని చరిష్మాతో ప్రజల్లోనూ ఎంతో ఆదరణ పొందడం ఈ డాన్ కే చెల్లింది. చేసేది మాదకద్రవ్యాల వ్యాపారం అయినా, పేద ప్రజలకు సాయం చేస్తాడన్న మంచి పేరుంది. 'ఎల్ చాపో' ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే అతని కుమార్తె అలెజాండ్రినా గిసెల్లీ గుజ్ మాన్ దాతృత్వ రూపేణా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తోంది.

కరోనా దెబ్బకు మెక్సికో లాక్ డౌన్ లోకి వెళ్లడంతో పేదలు అష్టకష్టాలు పడుతున్నారు. వారిని ఆదుకోవడం తన ధర్మంగా భావించిన అలెజాండ్రినా తండ్రి ముఖచిత్రంతో బాక్సులు తయారుచేయించి వాటిలో నిత్యావసరాలు ఉంచి దేశవ్యాప్తంగా పంపిణీ చేయిస్తోంది. డాన్ కుమార్తెగా ఎంతో గుర్తింపు ఉన్న అలెజాండ్రినా ఆన్ లైన్ లో తండ్రి పేరు మీద ఓ ఫ్యాషన్ దుకాణం నడుపుతోంది. ఆమె బ్రాండ్ పేరు 'ఎల్ చాపో 701'. ఈ సంస్థకు మెక్సికో వ్యాప్తంగా సిబ్బంది కూడా ఉన్నారు. ఇప్పుడీ సిబ్బంది సాయంతోనే అలెజాండ్రినా పేదలను ఆదుకుంటోంది. ఆమె అందించే కిట్లలో మాస్కులు కూడా ఉన్నాయి. వాటిపై ఆమె తండ్రి ఫొటో ముద్రించి ఉంది.

More Telugu News