Chandrababu: ‘కరోనా’ వ్యాప్తిలో వైసీపీ నేతలు ‘సూపర్ స్ప్రెడర్స్’గా మారారు.. ఇదిగో వీడియో!: చంద్రబాబు

Chandrababu criticises Jagan Govenment
  • లాక్ డౌన్ నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘించారు
  • ఇవాళ వైజాగ్ లోని  ఫంక్షన్ హాలులో వారు కలిశారు
  • వైజాగ్ ఎంపీ, మంత్రి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది
‘కరోనా’ వ్యాప్తి చేసే వారిగా వైసీపీ నేతలు మారడం చూసి ఆశ్చర్యపోయానంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ ట్వీట్ చేశారు. ‘కరోనా’ వ్యాప్తిలో వైసీపీ నేతలు ‘సూపర్ స్ప్రెడర్స్’గా మారడం చూసి ఆశ్చర్యపోయానని, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వందలాది వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఇవాళ వైజాగ్ లోని ఓ ఫంక్షన్ హాలులో కలిశారని అన్నారు. ఈ సమావేశానికి వాళ్లందరూ హాజరయ్యారని చెప్పిన చంద్రబాబు, ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు.

ఇదే ఫంక్షన్ హాలులో తాత్కాలిక క్వారంటైన్ కేంద్రం 

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక క్వారంటైన్ కేంద్రం ఇదే ఫంక్షన్ హాలులో ఉందని, కొవిడ్-19 పరీక్షల రిపోర్టు కోసం చాలా మంది అక్కడ వేచి చూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలా కలవడం ద్వారా వైరస్ బారిన పడే ప్రమాదంపెరుగుతుందని, రెట్టింపు సంఖ్యలో కేసులు పెరిగేందుకు దారితీస్తుందని అన్నారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
Vizag
Corona Virus

More Telugu News