Shilpa Shetty: అసత్యాలను ప్రచారం చేయొద్దు ప్లీజ్: శిల్పాశెట్టి

  • డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులకు దిగొద్దు
  • వారికి మద్దతుగా మన గొంతుకను వినిపిద్దాం
  • మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరం చేతులు కలుపుదాం
Dont spread rumours says Shilpa Shettty

కరోనా వైరస్ కు సంబంధించి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని, డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడవద్దని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి విన్నవించారు. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా కోరారు. రవీనా టాండన్ నిర్వహిస్తున్న 'జీతేగా ఇండియా జీతేంగే హమ్' కార్యక్రమంలో భాగంగా ఆమె ఓ వీడియో పోస్ట్ చేశారు. హెల్త్ వర్కర్లపై జరుగుతున్న దాడులకు సంబంధించి చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని రవీనా నిర్వహిస్తోంది.

మనల్ని కాపాడేందుకు వారి ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి మద్దతుగా మన గొంతుకను వినిపిద్దామని... మానవత్వంలో భాగంగానైనా ఈ పని చేద్దామని శిల్పాశెట్టి కోరారు. సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారికి మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటంలో భాగంగా వారి వంతు కృషిని నిర్వహిస్తున్న పోరాట యోధులను గౌరవిద్దామని వ్యాఖ్యానించారు. తప్పుడు సమాచారాన్ని, వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరం చేతులు కలుపుదామని పిలుపునిచ్చారు.

More Telugu News