Bandla Ganesh: తన జన్మ సార్థకం చేసుకున్న నేత కేసీఆర్: బండ్ల గణేశ్ ప్రశంసలు

Film producer Bandla Ganesh praises CM Kcr
  • ఇవాళ టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం
  • పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు
  • ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బండ్ల గణేశ్ ట్వీట్
ఇవాళ టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ పై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ప్రశంసలు కురిపించారు. పుష్కర కాలం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, ఆరేళ్లుగా అద్భుతం చేసి కోనసీమకు దీటుగా తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారని కొనియాడారు. తన జన్మ సార్థకం చేసుకున్న నేత కేసీఆర్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని బండ్ల గణేశ్ ఓ ట్వీట్ చేశారు.
Bandla Ganesh
producer
Tollywood
kcr
trs
cm
Telangana

More Telugu News