Harsha vardhan: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ ఓఎస్డీకి కరోనా పాజిటివ్

Union Minister Harsh Vardhan OSD infected to Coronavirus
  • సెక్యూరిటీ గార్డును ఎయిమ్స్‌కు తరలించిన అధికారులు
  • అతడు కలిసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు
  • అతనితో వున్న సిబ్బందికి సెల్ఫ్ క్వారంటైన్‌  
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఓఎస్డీగా పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుకు కరోనా వైరస్ సంక్రమించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. విషయం తెలిసిన మంత్రి సిబ్బంది కూడా ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన వైద్యాధికారులు ఓఎస్డీ కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. అలాగే, ఆయనతోపాటు పనిచేసిన సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లమని ఆదేశించారు.

వైరస్ బారినపడిన సెక్యూరిటీ గార్డు  మంత్రి కార్యాలయంలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ టీచింగ్ బ్లాక్‌లో మంత్రికి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడు ఎవరెవరిని కలిసి ఉంటాడనే దానిపై ఆరా తీస్తున్న అధికారులు వారిని గుర్తించే పనిలో పడ్డారు.  
Harsha vardhan
Union minister
OSD
Corona Virus

More Telugu News