ఢిల్లీలో ప్లాస్మా థెరపీతో కోలుకున్న కరోనా రోగి.. ఆసుపత్రి నుంచి ఇంటికి!
- ఈ నెల 4న ప్రైవేటు ఆసుపత్రిలో రోగి
- పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పైకి
- ప్లాస్మా థెరపీతో అనూహ్యంగా కోలుకున్న వైనం
కరోనా బారిన పడిన బాధితుడు ఈ నెల 4న ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అతడి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఈ నెల 8న వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో ప్లాస్మా థెరపీతో చికిత్స అందించారు.
ఈ చికిత్సతో అతడు క్రమంగా కోలుకుంటుండడం వైద్యుల్లో ఉత్సాహం నింపింది. నాలుగు రోజుల తర్వాత వెంటిలేటర్ తొలగించారు. ఈ నెల 18 వరకు సప్లిమెంటరీ ఆక్సిజన్ అందిస్తూ వచ్చిన వైద్యులు.. అతడు పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం డిశ్చార్జ్ చేశారు.