Tablighi Jamaat: తబ్లిగీ జమాత్ చీఫ్ కు కరోనా నెగెటివ్

Tablighi Jamaat chief Maulana Saad Kandhalvi tested corona negative
  • కరోనా వ్యాప్తికి కారకులంటూ తబ్లిగీలపై ఆరోపణలు
  • తబ్లిగీ జమాత్ చీఫ్ పై హత్యానేరం, మనీలాండరింగ్ కేసులు
  • సాద్ కంధాల్వీకి కరోనా టెస్టులు నిర్వహించిన ఢిల్లీ అధికారులు
భారత్ లో కరోనా వ్యాప్తి విదేశాల్లో ఉన్నవారు ఇక్కడి రావడంతో మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశం అనంతరం మరింత వ్యాపించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కంధాల్వీపై హత్యానేరం, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా సాద్ కంధాల్వీకి  కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. ఈ మేరకు ఆయన న్యాయవాది వెల్లడించారు. జమాత్ చీఫ్ కరోనా టెస్టుల నివేదికలు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇంకా అందలేదు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం సాద్ కంధాల్వీని విచారించే అవకాశాలు ఉన్నాయి.
Tablighi Jamaat
Saad Kandhalvi
Corona Virus
Negative

More Telugu News