India: దేశంలో భారీగా పెరిగిపోతోన్న కరోనా కేసులు... 24 గంటల్లో 1,990 మందికి కొవిడ్‌-19 నిర్ధారణ

Indias COVID19 count reaches 26496 deaths at 824
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1,990 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 26,496కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 824 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.  
 
ఇప్పటి వరకు కరోనా నుంచి 5,804 మంది కోలుకున్నారని చెప్పింది. ఆసుపత్రుల్లో 19,868 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 7,628కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 323 మంది మృతి చెందారు.

గుజరాత్‌లో 3,071 మందికి కరోనా సోకగా, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,625కి చేరింది. తమిళనాడులో 1,821, రాజస్థాన్‌లో 2,083, మధ్యప్రదేశ్‌లో 2,096 పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో 1,793 మందికి కరోనా సోకింది. కేరళలో 457 మందికి కరోనా సోకింది. కరోనా వైరస్‌ కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 
Go Back to Shorts
India
Corona Virus
COVID-19

More Telugu News