జూమ్ యాప్ కు పోటీగా 'మెసెంజర్ రూమ్స్' తీసుకువస్తున్న ఫేస్ బుక్
- లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజాదరణ పొందిన జూమ్ యాప్
- జూమ్ వీడియో కాల్ భద్రతపై సందేహాలు
- సరికొత్త ఫీచర్ తో యూజర్లను ఆకట్టుకోవాలనుకుంటున్న ఫేస్ బుక్
ఫేస్ బుక్ యాప్ లో కానీ, మెసెంజర్ లో కానీ ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ లో 'రూమ్ క్రియేటర్' గా ఒకరు వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే 'కాల్ మేకర్' అన్నమాట. 'కాల్ మేకర్ లేక రూమ్ క్రియేటర్' నిర్ణయంపైనే ఎవరెవరు ఆ కాల్ లో భాగస్వాములవుతారన్నది ఆధారపడి ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఫేస్ బుక్ సమాయత్తమవుతోంది.
వర్చువల్ గా ఓ రూమ్ క్రియేట్ చేయడం అంటే ఓ వీడియో కాన్ఫరెన్స్ కాల్ ప్రారంభించడంగా భావించవచ్చు. రూమ్ క్రియేటర్ నుంచి వచ్చిన ఇన్వైట్ ను ఓకే చేస్తే మీరు కూడా ఆ కాన్ఫరెన్స్ లోకి ఎంటరవుతారు. మెసెంజర్ రూమ్స్ ఫీచర్ ను తొలుత కొన్ని దేశాల్లో ఈ వారంలో ప్రవేశపెట్టాలని ఫేస్ బుక్ భావిస్తోంది. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తం చేయాలన్నది ఈ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం యోచన. కాగా, వాట్సాప్ రాకతో కళ తప్పిన మెసెంజర్ కు ఈ సరికొత్త ఫీచర్ వన్నెలద్దుతుందని ఫేస్ బుక్ భావిస్తోంది.