Jagan: గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ క్లినిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి: సీఎం జగన్

  • కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష
  • ల్యాబ్ లు లేని జిల్లాల్లో వెంటనే ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని సూచన
  • నిన్న ఒక్కరోజే 6,928 పరీక్షలు చేసినట్టు సీఎంకు తెలిపిన అధికారులు
CM Jagan said village clinics will play key role

ఏపీ సీఎం జగన్ ఇవాళ సమీక్షా సమావేశాలతో బిజీగా ఉన్నారు. కొవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ క్లినిక్స్ కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. కరోనా ల్యాబ్ లు లేని జిల్లాల్లో వెంటనే ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు సీఎంకు కరోనా నివారణ చర్యల గురించి వివరించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 6,928 పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు 61,266 పరీక్షలు జరిపినట్టు సీఎంకు నివేదించారు.

కాగా, సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లలో నాడు-నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలపైనా సమీక్ష చేపట్టారు. పాఠశాలల్లో ఫర్నీచర్, చాక్ బోర్డులు తదితర వస్తు సామగ్రి కోసం టెండర్లు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా, వచ్చే విద్యాసంవత్సరానికి గాను స్కూలు పిల్లలకు ఇవ్వనున్న యూనిఫాం దుస్తులు, స్కూలు బ్యాగుల నమూనాలను సీఎం జగన్ పరిశీలించారు. ఆపై అధికారులకు పలు సూచనలు చేశారు.

More Telugu News