Yogi Adityanath: యోగి సంచలన ఆదేశాలు.. జూన్ 30 వరకు ఆంక్షల పొడిగింపు!

  • ప్రజలు గుమికూడటంపై ఆంక్షలు
  • రాజకీయ ర్యాలీలు, ఫంక్షన్లపై ఆంక్షలు
  • రంజాన్ ప్రార్థనలపై కూడా ఆంక్షలు
No Public Gatherings In UP Till June 30 Orders Yogi Adityanath

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇంత వరకు కంట్రోల్ లోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలను జారీ చేశారు. జూన్ 30వ తేదీ వరకు జనాలు గుమికూడటంపై ఆంక్షలు కొనసాగుతాయని ఆదేశాలను జారీ చేశారు. రాజకీయ ర్యాలీలు, ఫంక్షన్లపై నిషేధం ఉంటుందని ఆదేశాలలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు మృత్యుంజయ కుమార్ స్పందిస్తూ, జూన్ 30 వరకు ప్రజలు గుమికూడకుండా కఠిన చర్యలను తీసుకోవాలంటూ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. కరోనాను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా ముస్లింలు గుమికూడటంపై కూడా నిషేధాన్ని విధించారు.

మరోవైపు, యూపీలో ఇప్పటి వరకు 1,600కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 25 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలను పోగొట్టుకున్నారు.

More Telugu News