Corona Virus: ఏపీలో మరో 61 మందికి కరోనా నిర్ధారణ.. 1,000 దాటిన కొవిడ్‌-19 కేసులు

coronavirus cases in india
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 1,000 దాటింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 61 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కర్నూలులో కొత్తగా 14, గుంటూరులో 3, కడపలో 4, అనంతపురంలో 5, తూర్పు గోదావరి జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయని వివరించింది. నెల్లూరులో నాలుగు కేసులు నమోదయ్యాయి.

ఇక, శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా మూడు కేసులు నమోదు కాగా, విజయనగరంలో మాత్రమే ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  మొత్తం 1,016కి చేరింది. కర్నూలులో అత్యధికంగా 275, గుంటూరులో 209 కరోనా కేసులు నమోదయ్యాయి.

కాగా, రాష్ట్రంలో కరోనాతో 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు వివరించారు. ఏపీలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 814గా ఉంది. 171 మంది కరోనా నుంచి కోలుకున్నారు.                
ఏయే జిల్లాల్లో ఎన్నెన్ని కేసులు..?
                        
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News