Chiranjeevi: ‘రక్షించే పోలీసులను.. ’ అంటూ చంద్రబోస్ రాసిన పాటకు చిరంజీవి ప్రశంసలు!

  • ‘కరోనా’ కష్టకాలంలో పోలీసుల విధి నిర్వహణలపై పాట
  • సైబరాబాద్ సీపీ సూచన మేరకు పాట రాసిన చంద్రబోస్
  • ఆ పాట ఆలోచన రేకెత్తించేలా ఉందంటూ చిరంజీవి ప్రశంస 
Hero Chiranjeevi praises lyrcist chandrabose

‘కరోనా’ బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న పోలీసులను గౌరవిద్దాం, వారికి సహకరిద్దామంటూ ప్రముఖ హీరో చిరంజీవి పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ రాసి, స్వయంగా పాడిన పాట వీడియోను చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ఈ పాట ఉందంటూ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా  సైబరాబాద్ పోలీస్ కమిషనర్, సైబరాబాద్ పోలీస్ ను ట్యాగ్ చేశారు.

సీపీ సజ్జనార్ పాట రాయమన్నారు.. బాధ్యతతో రాశాను: చంద్రబోస్

‘కరోనా’ కష్టకాలంలో పోలీసుల విధి నిర్వహణ చాలా గొప్పగా ఉందని, చాలా మంది ప్రజలు వారికి సహకరిస్తున్నారని, మరికొంత మంది అడ్డుతగులుతున్నారని, ఈ అంశంపై పాట రాయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అడిగారని, ‘బాధ్యతతో ఆ పాట రాశానని పాటల రచయిత చంద్రబోస్ పేర్కొన్నారు. ‘ఆలోచించండి అన్నలారా, ఆవేశం మానుకోండి తమ్ముల్లారా..’ అంటూ తాను రాసిన పాటను ఆయన స్వయంగా పాడి వినిపించారు.

More Telugu News