Telangana: తెలంగాణలో కరోనా వాస్తవాల పరిశీలనకు ప్రత్యేక బృందాలను పంపిస్తున్న కేంద్రం

Centre to send special team to Telangana to estimate corona situations
  • ఇప్పటికే ఆరు బృందాల ఏర్పాటు
  • అదనంగా మరికొన్ని ప్రత్యేక బృందాలు
  • హైదరాబాద్ లో పర్యటించనున్న ప్రత్యేక బృందం
రాష్ట్రాల్లో కరోనా వాస్తవాలను మదింపు చేసేందుకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కేంద్ర బృందాల రాక పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కేంద్రం క్షేత్రస్థాయి పరిశీలన కొనసాగిస్తోంది. తాజాగా, తెలంగాణతో పాటు తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ బృందాల్లో పలు మంత్రిత్వ శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ బృందాలకు అదనపు కార్యదర్శి హోదా ఉన్న అధికారులు నాయకత్వం వహిస్తారని, తెలంగాణలోని హైదరాబాద్ లో, గుజరాత్ లోని సూరత్ లో, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఈ బృందాలు పర్యటిస్తాయని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ వెల్లడించారు. ఇప్పటికే ఏర్పాటైన ఆరు బృందాలకు ఇవి అదనం అని తెలిపారు.

ప్రధాన హాట్ స్పాట్లుగా గుర్తించిన జిల్లాల్లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోందని, హైదరాబాద్, సూరత్, అహ్మదాబాద్, చెన్నై, థానే వంటి అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ ఉల్లంఘనలు పెరుగుతున్నాయని, వైద్య, పోలీసు సిబ్బంది పట్ల దాడులు జరుగుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
Telangana
Centre
SpecialTeam
Corona Virus
Lockdown
COVID-19

More Telugu News