Mukhesh Ambani: ఫేస్ బుక్ తో కీలక చర్చల్లో ముఖేశ్ అంబానీ కుమారుడు, కుమార్తె!

  • రిలయన్స్ జియోలో రూ. 43,574 కోట్ల పెట్టుబడి పెట్టిన ఫేస్ బుక్
  • గత ఏడాది మధ్యలోనే ఇరు కంపెనీల మధ్య చర్చలు ప్రారంభం
  • ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగుతున్న చర్చలు
Mukesh Ambanis Twins Akash and Isha Held Talks With Facebook

కరోనా ప్రభావంతో ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్ దారుణంగా క్రాష్ అవడంతో.. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఆస్తుల విలువ ఈ ఏడాది బాగా తగ్గిపోయాయి. ఈ తరుణంలో ఫేస్ బుక్ తో కుదుర్చుకున్న డీల్ తో ఆయన సంపద మళ్లీ భారీగా పెరిగింది. దీంతో, జాక్ మాను వెనక్కి తోసి ముఖేశ్ మళ్లీ ఆసియాలోనే అత్యంత శ్రీమంతుడిగా అవతరించారు. రిలయన్స్ జియోలో రూ. 43,574 కోట్ల పెట్టుబడితో 9.9% వాటాను ఫేస్ బుక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్ల క్రితం వాట్సాప్ ను సొంతం చేసుకున్న తర్వాత ఫేస్ బుక్ ఆ స్థాయిలో మరో డీల్ చేయడం ఇదే ప్రథమం.

ఈ భారీ డీల్ కు సంబంధించిన చర్చలు ఇరు కంపెనీల మధ్య గత ఏడాది మధ్యలోనే ప్రారంభమయ్యాయి. రెండు కంపెనీలకు చెందిన సీనియర్ అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. మోర్గాన్ స్టాన్లీ ఆధ్వర్యంలో జరిగిన ఈ చర్చల్లో ముఖేశ్ అంబానీ కుమారుడు అకాశ్, కుమార్తె ఈషా కూడా పాల్గొన్నారు.

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో... ప్రయాణాలు కూడా ఇబ్బందిగా మారాయి. దీని ప్రభావం అగ్రిమెంట్ ప్రాసెస్ పై పడింది. దీంతో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఉండేందుకు... ప్రస్తుతం ఈ చర్చలను వీడియో కాన్ఫరెన్స్, ఫోన్ కాల్స్ ద్వారా జరుపుతున్నారు.

More Telugu News