Sajjala Ramakrishna reddy: చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని తన నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు: సజ్జల రామకృష్ణారెడ్డి

AP Government advisor Sajjala criticises chandrababu
  • ‘కరోనా’ నియంత్రణకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది
  • ఇవేవీ పట్టించుకోకుండా  బాబు వ్యాఖ్యలు చేస్తున్నారు
  • ప్రతిపక్షం అనేది బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ‘కరోనా’ నియంత్రణకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని అన్నారు. ఇవేవీ పట్టించుకోకుండా చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తున్నారని, రాష్ట్రంలో ‘కరోనా’ కంటే భయంకరమైన రాజకీయ వైరస్ ఉందంటూ ఆయనపై విరుచుకుపడ్డారు.

చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని తనకు తోచినట్టు మాట్లాడుతున్నారని, ప్రతిపక్షం అనేది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలను టీడీపీ కోల్పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Sajjala Ramakrishna reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News