Chiranjeevi: సచిన్ కు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Chiranjeevi greets Sachin Tendulkar
  • క్రికెట్ దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్
  • దేశం గర్వించదగిన వ్యక్తివి అంటూ ప్రశంస
  • దేశానికి స్ఫూర్తిదాతవు అంటూ కితాబు
భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, జన్మదినం సందర్భంగా... ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, సామాన్యులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా సచిన్ కు విషెస్ తెలిపారు. 'క్రికెట్ దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకే ఒక మాస్టర్ బ్లాస్టర్.. దేశం గర్వించదగిన నీవు... తరతరాలకు స్ఫూర్తిదాతగా నిలుస్తావు. దేవుడి ఆశీర్వాదాలు నీకు ఉంటాయి' అని చిరంజీవి ట్వీట్ చేశారు. కేరళ బ్లాస్టర్ ఫుట్ బాల్ క్లబ్ కు సచిన్ తో పాటు చిరంజీవి, నాగార్జున సహ భాగస్వాములుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సచిన్ తో చిరంజీవికి చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
Chiranjeevi
Sachin Tendulkar
Birthday
Tollywood

More Telugu News