Mahesh Babu: ముందుగా రాజమౌళి .. ఆ తరువాతే అనిల్ రావిపూడి

Anil Ravipudi Movie
  • మహేశ్ కి హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి
  •  మరో ప్రాజెక్టు చేద్దామని మాటిచ్చిన మహేశ్
  •  రాజమౌళి ఎంట్రీతో మారిన ప్లాన్  
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు చేసిన 'సరిలేరు నీకెవ్వరు' భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆయనతో మరో సినిమా చేయడానికి మహేశ్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పరశురామ్ సినిమా తరువాత అనిల్ రావిపూడితో కలిసి మహేశ్ బాబు సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా చెప్పుకున్నారు. ఈ లోగా 'ఎఫ్ 3' పూర్తి చేయవచ్చనే ఆలోచనలో అనిల్ రావిపూడి వున్నాడు.

ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఎంట్రీ ఇచ్చారు. తన తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉంటుందని ప్రకటించారు. రాజమౌళి కాంబినేషన్ సెట్ కావడం అంత తేలికైన విషయం కాదు. అందువలన ముందుగా ఆయనతో సినిమా చేసి, ఆ తరువాత అనిల్ రావిపూడి ప్రాజెక్టును పట్టాలెక్కించవచ్చనే ఆలోచనలో మహేశ్ బాబు వున్నాడని అంటున్నారు. అంటే ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమా సెట్స్ పైకి వెళ్లేది వచ్చే ఏడాదిలోనేనని అనుకోవలసి ఉంటుంది.
Mahesh Babu
Rajamouli
Anil Ravipudi

More Telugu News