కులవృత్తిని గుర్తు చేసుకుంటూ... భార్యకు, పిల్లలకు వెండి నగలు తయారు చేసిన సంపూర్ణేశ్ బాబు!
- రాజు, పేద.. రెండింటికీ పెద్ద తేడా లేదు
- నీ డబ్బు, ఆస్తి.. నీ వెనుక రావు
- నీవు ఎక్కడి నుంచి వచ్చావో అది మర్చిపోకు
తన పాత కంసాలి వృత్తిలోకి దిగి... తాను ఎంతో ప్రేమించే భార్యకు వెండితో కాలి మెట్టెలు, పిల్లలకు గజ్జెలు తయారు చేసి ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు నెటిజెన్లను ఆకట్టుకుంటున్నాయి. 'రాజు, పేద.. పెద్ద తేడా లేదు. నీ డబ్బు, ఆస్తి నీ వెనుక రావు. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని గుర్తు చేసుకుంటూ... మా ఆవిడ కోసం నా పాత కంసాలి వృత్తిని గుర్తు చేసుకుంటూ... ఇంట్లో మిగిలిన గజ్జెలతో ఆమె కాలికి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేసి ఇచ్చాను' అని ట్వీట్ చేశాడు. సంపూర్ణేశ్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.