ఎయిర్ టెల్ కొత్త ప్యాక్... ఏడాది పాటు డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ ఉచితం!

Disney Hotstar Free for Airtel Customers
  • డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ ఏడాది చందా రూ. 399
  • రూ. 401కే ఎయిర్ టెల్ వినియోగదారులకు అవకాశం
  • నెల రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటా కూడా
ప్రస్తుతం ఇంటికే పరిమితమైన కస్టమర్ల కోసం ఎయిర్ టెల్ ఆకర్షణీయమైన రీచార్జ్ ప్యాక్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 401 ప్రీపెయిడ్ ప్యాక్ తో రోజుకు 3 జీబీడేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. ఇదే సమయంలో ఏడాది పాటు డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ ఉచితం. ఈ ప్యాక్ లో కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు ఉండవు. వాస్తవానికి డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ ప్యాక్ చందా ఏడాదికి రూ. 399.

ఇక ఎయిర్ టెల్ చందాదారులకు రోజుకు 3 జీబీ డేటాతో పాటు, ప్యాక్ ముగిసిన తరువాత కూడా ఏడాది పాటు చందా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ ప్లాన్ ను తీసుకుంటే సరిపోతుందని, ఆపై ఏ ఇతర ప్లాన్ తో అయినా తమ ఫోన్ నంబర్ ను రీచార్జ్ చేసుకుని కాలింగ్, మెసేజ్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది.

ఇదిలావుండగా, ఎయిర్ టెల్ రూ. 398 ప్రీ పెయిడ్ ప్లాన్ లో అమెజాన్ ప్రైమ్ చందా ఉచితంగా అందుతుందన్న సంగతి తెలిసిందే. ఇందులో వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు కూడా అందుతాయి. ఇటీవలి కాలంలో పలు ఆంగ్ల చిత్రాలను, ముఖ్యంగా పిల్లలు ఇష్టపడే చిత్రాలను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం టైటిల్స్ ను వీఐపీలో, ఇంగ్లీష్ టైటిల్స్ ను ప్రీమియం ద్వారా అందిస్తోంది.
Go Back to Shorts
Airtel
Disney + Hot Star VIP
Subscription

More Telugu News