Pawan Kalyan: నా రాజకీయ దృక్పథంలో మార్పు తెచ్చిన పుస్తకం ఇదే: పవన్ కల్యాణ్

Pawan Kalyan tells Kharaveludu book changed his political view
  • ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం
  • 'ఖారవేలుడు' పుస్తకం గురించి ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్
  • నాగబాబు బహూకరించాడని వెల్లడి
ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. మానవ జీవితంతో మమేకమైన పుస్తకం పండుగ నేడు అంటూ వ్యాఖ్యానించారు. ఓ పుస్తక ప్రియునిగా తన భావాలను అందరితో పంచుకోవాలని భావిస్తున్నానని, అందుకే తన రాజకీయ దృక్పథంలో మార్పు తీసుకువచ్చిన 'ఖారవేలుడు' పుస్తకం గురించి వివరిస్తున్నానని ట్వీట్ చేశారు.

"శిష్టా ఆంజనేయ శాస్త్రి రాసిన 'ఖారవేలుడు' పుస్తకంతో నా రాజకీయ ఆలోచన విధానం మార్చుకున్నాను. దేశానికే ప్రథమ ప్రాధాన్యత అని గుర్తించాను. నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'జానీ' ఫ్లాప్ కావడంతో మా రెండో అన్నయ్య నాగబాబు ఈ పుస్తకాన్ని నాకు బహూకరించాడు. ఈ పుస్తకం నాకంటూ ఓ రాజకీయ పంథాను అందించింది" అని వెల్లడించారు.
Pawan Kalyan
Kharaveludu
World Book Day
Politics
Nagababu
Johnny

More Telugu News