Corona Virus: దేశంలో 5,00,542 శాంపిళ్లను పరీక్షించాం.. 21,797 శాంపిళ్లు కరోనా పాజిటివ్‌గా తేలాయి: ఐసీఎంఆర్

coronavirus cases in india
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించి చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రతి రోజు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం మీద ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 4,85,172 మంది నుంచి 5,00,542 శాంపిళ్లు తీసుకుని పరీక్షించామని భారత వైద్య పరిశోధన మండలి ప్రకటన చేసింది. వారిలో ఇప్పటివరకు 21,797 శాంపిళ్లు పాజిటివ్‌గా తేలాయని ప్రకటించింది.

అయితే, దేశం మొత్తం మీద ఈ రోజు ఉదయం వరకు 21,359 కేసులు నమోదయ్యాయని అంతకుముందు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా 685 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా నుంచి 4,348 మంది కోలుకున్నారని వివరించింది.
Go Back to Shorts
Corona Virus
India
ICMR

More Telugu News