ICMR: కరోనా టెస్టుల విషయంలో.. రాష్ట్రాలకు మరోసారి ఐసీఎంఆర్‌ కీలక సూచనలు

icmr on corona kits
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోన్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మరోసారి రాష్ట్రాలకు పలు కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా కరోనా పరీక్షల విషయంపై సూచించింది. కరోనా నిర్ధారణ చేయడానికి కేవలం ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు మాత్రమే చేయాలని చెప్పింది. ర్యాపిడ్‌ యాంటీ బాడీ టెస్టులు చేయొద్దని సూచించింది.

అనుమానితుల ముక్కు, గొంతు నుంచి తీసుకునే స్వాబ్‌ ఆధారంగా మాత్రమే పరీక్షలు చేయాలని ఐసీఎంఆర్‌ తెలిపింది. మనుషుల్లో రోగ నిరోధక శక్తి ఎంత ఉందో తెలుసుకోవడానికే యాంటీ బాడీ టెస్టులని చెప్పింది.

ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్ల స్థానంలో యాంటీ బాడీ టెస్టింగ్‌ కిట్లు వినియోగించకూడదని స్పష్టం చేసింది. దేశంలోని రాష్ట్రాలన్నీ ఐసీఎంఆర్‌ ప్రొటోకాల్‌ను అనుసరించాలని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఐసీఎంఆర్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
Go Back to Shorts
ICMR
Corona Virus
India

More Telugu News