Bellamkonda Ganesh: బెల్లంకొండ గణేశ్ హీరోగా ప్రేమకథ ..50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి

Pavan Sadhineni Movie
  • హీరోగా బెల్లంకొండ గణేశ్ ఎంట్రీ
  • లవ్ అండ్ ఎమోషనల్ జర్నీగా సాగే కథ
  • ప్రత్యేక ఆకర్షణగా రాధన్ సంగీతం  
బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు బెల్లంకొండ గణేశ్ కూడా హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా పవన్ సాధినేని ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. విభిన్నమైన ప్రేమకథగా ఈ సినిమా నిర్మితమవుతోంది. నల్లమలుపు బుజ్జి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణను జరుపుకుంది. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. దాంతో ఇంతవరకూ షూట్ చేసిన పార్టును ఎడిట్ చేశారట. అవుట్ పుట్ పట్ల దర్శక నిర్మాతలు సంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు.

కొత్త హీరో అయినప్పటికీ గణేశ్ కామెడీ సీన్స్ ను కూడా చాలా బాగా చేశాడని అంటున్నారు. లవ్ .. ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాల్లోను ఆయన మంచి అనుభవం కలిగిన ఆర్టిస్టులా చేశాడని చెబుతున్నారు. రాధన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
Bellamkonda Ganesh
Pavan Sadhineni
Nallamalupu Bujji

More Telugu News