ISI: పాకిస్థాన్ ఐఎస్ఐకి అత్యంత సన్నిహితుడైన ఐసిస్ కమాండర్ అరెస్ట్!

Afghan forces arrests ISIS commander Muneeb
  • మునీబ్ మహమ్మద్ ను అరెస్ట్ చేసిన ఆఫ్ఘన్ భద్రతా దళాలు
  • ఐఎస్ఐతో పాటు పలు ఉగ్ర సంస్థలతో సన్నిహిత సంబంధాలు
  • ఐసిస్ లో చేరక ముందు లష్కరే తాయిబాలో కీలక పాత్ర
ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలు ఉగ్రవాదులపై పైచేయి సాధించాయి. ఐసిస్ ఉగ్ర సంస్థ ఖొరసాన్ విభాగానికి చెందిన టాప్ కమాండర్ మునీబ్ మహమ్మద్‌ను అరెస్ట్ చేశాయి. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ తెలిపింది. మునీబ్ ది పాకిస్థాన్ అని వెల్లడించింది.

మునీబ్ అత్యంత కీలకమైన ఉగ్రవాది అని... ఇతనికి పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో పాటు ఉగ్ర సంస్థలైన హక్కానీ నెట్ వర్క్, లష్కరే తాయిబా, జమాత్ ఉల్ ఉలేమా, సిపా ఈ సహబాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ఈ సంస్థల మధ్య మునీబ్ ఒక వారధిలా వ్యవహరిస్తున్నాడని పేర్కొంది. ఐఎస్ఐ, ఉగ్ర సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిపింది. ఐసిస్ లో చేరక ముందు మునీబ్ లష్కరే తాయిబాలో కీలకంగా వ్యవహరించినట్టు తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది.
ISI
Muneeb Mohammed
Afghanistan
Arrest
ISIS

More Telugu News