Corona Virus: కరోనా బాధితులకు ఆయుర్వేద చికిత్స.. క్లినికల్ ట్రయల్స్‌కు డాక్టర్ల రెడీ!

  • ఫిఫట్రాల్ అనే ఔషధాన్ని తయారుచేసిన బీహెచ్‌యూ
  • కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ నుంచి అనుమతుల కోసం ఎదురుచూపు
  • డాక్టర్ కేఎన్ ద్వివేదీ నేతృత్వంలో కార్యాచరణ
BHU professors plan clinical trial of ayurvedic drug fifatrol

కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో ప్రపంచం మొత్తం నిమగ్నమైంది. చైనా, అమెరికా వంటి దేశాలు ఇప్పటికే తయారుచేసిన ఔషధానికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు, మన దేశం ఈ మహమ్మారిపైకి ఆయుర్వేద ఔషధాన్ని ప్రయోగించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్‌కు వైద్యులు సిద్ధమవుతున్నారు.

‘ఫిఫట్రాల్’ అనే ఆయుర్వేద ఔషధాన్ని కరోనా పీడితులపై  ప్రయోగించేందుకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) సన్నద్ధమైంది. ప్రధాన పరిశోధకుడు అయిన డాక్టర్ కేఎన్ ద్వివేదీ నేతృత్వంలో ఓ కార్యాచరణను రూపొందించారు. కొవిడ్-19పై ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ నుంచి క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులు వచ్చిన వెంటనే వైద్యులు ఈ చికిత్స ప్రారంభిస్తారు.

More Telugu News