Rajamouli: మహేశ్ కథపై రాజమౌళి కసరత్తు .. రంగంలోకి దిగిన విజయేంద్ర ప్రసాద్

Rajamouli Movie
  • రాజమౌళి నెక్స్ట్ మూవీ హీరోగా మహేశ్ బాబు
  •  విజయేంద్ర ప్రసాద్ వినిపిస్తోన్న స్టోరీ లైన్స్
  •  పాన్ ఇండియా మూవీగానే నిర్మాణం
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా షూటింగు మళ్లీ మొదలుకానుంది. మిగిలిన షూటింగుకి సంబంధించిన అన్ని పనులు సిద్ధంగానే వున్నాయట. అందువలన రాజమౌళి .. తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడని అంటున్నారు.

తన తదుపరి సినిమాను ఆయన మహేశ్ బాబుతో చేయనున్నాడు. అందుకోసం తన దగ్గరున్న స్టోరీ లైన్స్ ను రాజమౌళికి విజయేంద్ర ప్రసాద్ వినిపిస్తున్నారట. రాజమౌళికి లైన్ నచ్చితే అప్పుడు ఆ లైన్ ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో విజయేంద్ర ప్రసాద్ వున్నారని అంటున్నారు. తన నుంచి ఇంతవరకూ రాని జోనర్లో కథ వుండాలనీ, మహేశ్ బాబు ఇంతవరకూ చేయని పాత్రై వుండాలని రాజమౌళి భావిస్తున్నారట. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆయన స్టోరీ లైన్స్ వింటున్నట్టు చెబుతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగానే రూపొందనుండటం విశేషం.
Rajamouli
Mahesh Babu
Tollywood

More Telugu News