హైదరాబాద్‌లో దారుణం.. 8 ఏళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

Boy Raped Girl in Hyderabad
  • మెహదీపట్నంలోని భోజగుట్ట ప్రాంతంలో ఘటన
  • తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం
  • బాలిక కేకలు వేయడంతో పరార్
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఆడుకుందామని చెప్పి బాలికను తన ఇంటికి తీసుకెళ్లిన బాలుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మెహదీపట్నంలోని భోజగుట్ట ప్రాంతంలో జరిగిందీ ఘటన. తన కుటుంబ సభ్యులు బయటకు వెళ్లడంతో ఇదే మంచి అవకాశమని భావించిన బాలుడు ఆడుకుందామని చెప్పి బాలికను నమ్మించి, తన ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఆసిఫ్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
mehdipatnam
Boy
Girl

More Telugu News