jasti krishna kishore: ఏపీ సర్కార్ సస్పెండ్ చేసిన జాస్తి కృష్ణ కిషోర్‌కు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి!

Jasti krishna kishore got promotion
  • టీడీపీ హయాంలో ఈడీబీ సీఈవోగా జాస్తి
  • అవకతవకలు జరిగాయంటూ జగన్ ప్రభుత్వం వేటు
  • పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన సీబీడీటీ
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా పనిచేసి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సస్పెన్షన్‌కు గురైన ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌కు ఇప్పుడు పదోన్నతి లభించింది. ఆయనకు ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

కృష్ణ కిషోర్ హయంలో ఈడీబీలో పలు అవకతవకలు జరిగాయంటూ జగన్ ప్రభుత్వం ఆయనపై వేటేయడం అప్పట్లో తీవ్ర విమర్శలకు కారణమైంది. రాజకీయంగా దుమారం రేగింది. విషయం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్)కు చేరడంతో ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేసింది. తిరిగి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు క్యాట్ అనుమతి ఇచ్చింది. దీంతో కృష్ణ కిషోర్‌ను రిలీవ్ చేయకుండా ఇంతకాలం ప్రభుత్వం తాత్సారం చేసింది. తాజాగా, ఆయన కేంద్రానికి రిపోర్టు చేయడంతో చేరిన వెంటనే పదోన్నతి లభించింది.
jasti krishna kishore
IAS Officer
Andhra Pradesh
Jagan

More Telugu News