Keeravani: చూస్తుంటే ఇది కూడా కరోనా వైరస్ లా వ్యాపిస్తోంది: కీరవాణి

Keeravani takes up Be The Realman challenge
  • 'బీ ద రియల్ మ్యాన్' చాలెంజ్ స్వీకరించిన కీరవాణి
  • సందీప్ వంగా నుంచి అందరికీ సోకుతోందని చమత్కారం
  • తాను కూడా ఇతరులకు అంటిస్తున్నానంటూ ట్వీట్
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తన సోదరుడు రాజమౌళి విసిరిన 'బీ ద రియల్ మ్యాన్' చాలెంజ్ ను స్వీకరించారు. ఈ మేరకు ఆయన ఇంట్లో బట్టలు ఉతికి ఆరేశారు. అంతేకాదు ఆరిన దుస్తులను శుభ్రంగా మడతలు పెట్టి షెల్ఫుల్లో సర్దారు. మొక్కలకు నీళ్లు పోయడమే కాదు, డైనింగ్ టేబుల్ ను పరిశుభ్రం చేశారు. ఆపై విజయగర్వంతో బొటనవేలిని పైకెత్తారు.

దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసిన కీరవాణి, 'అప్పుడప్పుడు బీ ద రియల్ మ్యాన్' అంటూ పేర్కొన్నారు. చూస్తుంటే ఈ చాలెంజ్ కూడా కరోనా వైరస్ లా వ్యాపిస్తోందని చమత్కరించారు. సందీప్ వంగా నుంచి రాజమౌళికి సోకిందని, రాజమౌళి నుంచి తనకు, ఇతరులకు సంక్రమించిందని పేర్కొన్నారు. ఈ చాలెంజ్ ను తనవంతుగా నిర్వర్తించానని, ఆపై దర్శకుడు క్రిష్ కు, సంగీతదర్శకుడు తమన్ కు అంటిస్తున్నానని ఫన్నీగా కామెంట్ చేశారు.
Keeravani
Be The Realman
Sandip Vanga
Rajamouli
Krish
Thaman
Corona Virus

More Telugu News