Pawan Kalyan: ‘జనసేన’ సైనికులకు పేరుపేరునా కృతఙ్ఞతలు: పవన్ కల్యాణ్

Janasena Leader pawan kalyan press note
  • ఆపన్నులకు అండగా నిలుస్తున్న ‘జనసేన’
  • కొందరు గుప్త దానాలు చేస్తున్నారు
  • జనసేవలో ‘జనసేన’ నిరంతరం మమేకం కావాలి
‘కరోనా’ కట్టడి నిమిత్తం కొనసాగుతున్న లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి నిస్సహాయంగా ఎదురుచూస్తున్న ఆపన్నులకు అండగా నిలుస్తున్న జనసేన పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్  తన ధన్యవాదాలు తెలిపారు.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘జనసేన’ నేతలు, సైనికులు, వీర మహిళలు.. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. పార్టీ కార్యాలయానికి అందుతున్న సమాచారం ద్వారా తమ వాళ్లు ఎక్కడెక్కడ సహాయం చేస్తున్నారో తెలుసుకుంటున్నానని తెలిపారు. కొందరు గుప్త దానాలు చేస్తున్నారని, తమ పేర్లను ప్రపంచానికి తెలియనీయడం లేదని ప్రశంసించారు.

జనసేవలో ‘జనసేన’ నిరంతరం మమేకం కావాలని కోరుకుంటున్నానని చెప్పిన పవన్ కల్యాణ్, ఈ సందర్భంగా మహాత్మా గాంధీ సూక్తి  ‘మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది .. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది’ అని ప్రస్తావించారు.
Pawan Kalyan
Janasena
Corona Virus
Help

More Telugu News